పాండవులకు ఫస్టాఫ్ టెన్షన్

పా.పా.తు సినిమా విడుదలకు సిద్ధమైంది. 31న గదలు, కిరీటాలు పెట్టుకోకుండానే పాండవులు తెరపైకి వచ్చేస్తున్నారు. అయితే ఫస్టాఫ్ కథలోకి తీసుకెళ్లడం వగైరా వంటి అంశాలతో అంత ఆసక్తికరంగా రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.  Advertisement సెకండాఫ్…

పా.పా.తు సినిమా విడుదలకు సిద్ధమైంది. 31న గదలు, కిరీటాలు పెట్టుకోకుండానే పాండవులు తెరపైకి వచ్చేస్తున్నారు. అయితే ఫస్టాఫ్ కథలోకి తీసుకెళ్లడం వగైరా వంటి అంశాలతో అంత ఆసక్తికరంగా రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సెకండాఫ్ మాత్రం బాగా వచ్చింది. ఫుల్ కామెడీతో రన్ అయిందని అంటున్నారు. సినిమాలో మనోజ్ కు, తనీష్ కు బాగా పేరు వస్తుందని యూనిట్ జనాలు అంటున్నారు.  రామరామ కృష్ణ కృష్ణ లాంటి భారీ ఫ్లాప్ తరువాత సుమారు రెండేళ్లు గ్యాప్ తో దర్శకుడు శ్రీవాస్ చేసిన సినిమా ఇది.  

అందుకే అతగాడు దీనిపై చాలా ఆశతో వున్నాడు. రీమేక్ సబ్జెక్ట్ కావడం కాస్త ధైర్యాన్నిస్తోంది. ఎటొచ్చీ ఇంతవరకు సరియైన హిట్ మాట దేవుడెరుగు, కాస్త ఆడిన సినిమా చేయని తనీష్, వరుణ్ ఈ సినిమాలో వుండడమే కాస్త టెన్షన్ పెడుతోంది.