లవ్ యూ బంగారమ్ ఎఫెక్ట్ వెళ్లి వెళ్లి అల్లు శిరీష్ కొత్త జంటపై పడింది. ఫిబ్రవరి 14న జనానికి దర్శనమిస్తారనుకున్న కొత్త జంట మార్చి లోకి వెళ్లిపోతున్నారు. మారుతి కెరియర్ లోనే (నిర్మాతే అయినా) ఘోరమైన ఫ్లాప్ గా లవ్ యూ బంగారమ్ మిగిలిపోయింది.
కెఎస్ రామారావ్ లాంటి పెద్ద నిర్మాత ఈ సినిమా తీసినా, జనం మాత్రం దీన్ని మారుతి సినిమాగానే చూసారు. మారుతి సంపాదంచకున్న క్రేజ్ ముందు ఈ సినిమా నిర్మాత, దర్శకుల పేర్లు కనిపించలేదు. ఇప్పుడు ఫ్లాప్ కావడం కూడా మారుతికి అంతకు అంతా మైనస్ గా మారింది.
దీని ప్రభావం కొత్త జంట పై పడుతుందని మారుతి అండ్ కో భయపడుతున్నారు. దీంతో నిర్మాత అరవింద్ కు చెప్పి, సినిమాను మార్చిలోకి విజయవంతంగా పంపేసారు.