ఒక్క టీజర్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది కేజిఎఫ్ 2 సినిమా. కేజిఎఫ్ తొలిభాగం ఏ హడావుడి, అంచనాలు లేకుండా జస్ట్ నామినల్ డబ్బింగ్ సినిమా మాదిరిగా తెలుగులో విడుదలైపోయింది. విజయం సాధించింది. దాంతో రెండో భాగం మీద అంచనాలు బాహుబలి రేంజ్ లో పెరిగిపోయాయి.
దీంతో తెలుగు థియేటర్ రైట్స్ కోసం యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో రేట్లు కోట్ చేస్తున్నారు. కానీ కన్నడ నిర్మాతలు దానికి దరిదాపుల్లో లేరని బోగట్టా. తెలుగు హక్కులకు ఎనభై కోట్లకు పైగానే ఆశిస్తున్నారని బోగట్టా. అయితే అందుకే తెలుగు జనాలు సిద్దంగా లేరు.
అందుకే భారీగా ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో, వాళ్లకి డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తారు. కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అన్నమాట. లాభం, నష్టం రెండూ నిర్మాతల భాద్యతే. ఈ మేరకు ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో మంతనాలు సాగుతున్నాయని భోగట్టా.
సినిమా తేడా వస్తే అణాపైసలతో సహా అడ్వాన్స్ వెనక్కు ఇస్తామని నిర్మాతలు మాట ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి తెలుగులో భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వడానికి ఎవరు సిద్దపడతారో?