నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో హీరో రవితేజ తో నిర్మిస్తున్న సినిమా ఖిలాడి. ఇది కాస్త భారీ బడ్జెట్ సినిమానే. ఇప్పటి వరకు బాగానే షూట్ జరిగింది.
కానీ వున్నట్లుండి ఈ సినిమా ను పక్కన పెట్టి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా మీదకు వెళ్లారు హీరో రవితేజ. అయితే ఇది క్యాజువల్ గా ప్లానింగ్ లో భాగంగా జరిగింది కాదని, ఖిలాడీ సినిమాకు హీరో కావాలనే పాజ్ బటన్ నొక్కారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఖిలాడీ సినిమా కోసం హీరో కేటాయించి కాల్ షీట్లకు దాదాపు డబుల్ ఇప్పటికే ఖర్చు అయిపోయాయని, దాంతో అసలు ఏం జరుగుతోంది..ఇంకా ఎంత బ్యాలన్స్ వుంది? ఇలాంటి చాలా చాలా వ్యవహారాల తేలే వరకు పాజ్ బటన్ మళ్లీ ఆన్ మోడ్ లోకి మార్చే అవకాశం తక్కువ అన్న టాక్ వినిపిస్తోంది.
రవితేజ డేట్లు, రెమ్యూనిరేషన్ ఇలాంటి విషయాల దగ్గర చాలా పర్టిక్యులర్ గా వుంటారు. అస్సలు మొహమాటానికి పోరు. పైగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఆయన కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ 15 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
అలాంటిది అంతకన్నా తక్కువ రెమ్యూనిరేషన్ తో ఇప్పటికే వందకు పైగా కాల్ షీట్లు ఖర్చు అయిపోతే పాజ్ బటన్ నొక్కక ఎలా వుంటారనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.