Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కియారా పెళ్లికి కొత్త ముహూర్తం, అన్ని ఏర్పాట్లూ?!

కియారా పెళ్లికి కొత్త ముహూర్తం, అన్ని ఏర్పాట్లూ?!

బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజ‌న్ కొన‌సాగుతూ ఉంది. ఈ ప‌రంప‌ర‌లో న‌టి కియారా అద్వానీ, న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ల పెళ్లి కూడా జ‌ర‌గ‌బోతోంద‌నే ఊహాగానాలు చాన్నాళ్లుగానే వినిపిస్తూ ఉన్నాయి. చాన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్నార‌నే ప్ర‌చారం పొందుతున్న ఈ జంట పెళ్లితో ఏకం కానుంద‌నే వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి.

వీరి పెళ్లికి ముహూర్తాలు కూడా ఖ‌రారు అయిన‌ట్టుగా గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. గ‌త ఏడాది డిసెంబర్లో వీరి పెళ్లి అంటూ హ‌డావుడి జ‌రిగింది. వీరు రాజ‌స్తాన్ లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పుడు రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

అయితే ఇప్పుడు కియ‌రా, సిద్ధార్థ్ ల పెళ్లికి కొత్త ముహూర్తం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి ఆరో తేదీన వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని కొత్త టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్త‌వుతున్నాయ‌ని, ద‌గ్గ‌రి వాళ్ల‌ను, బంధువుల‌ను వీరు ఆహ్వానిస్తున్న‌ట్టుగా కూడా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

అంగ‌రంగ‌వైభవంగా వీరి వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని, అందుకు బంధుమిత్రులకు పిలుపులు సాగుతున్నాయ‌ని, మ‌రోవైపు ఏర్పాట్లు కూడా ఊపందుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 

అయితే ఈ పెళ్లి ఊహాగానాల‌పై ఈ జంట పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు. మీడియా డైరెక్టుగా అడిగిన సంద‌ర్భాల్లో కూడా వీరు ముసిముసి న‌వ్వుల‌తోనే స్పందిస్తున్నారు. అంతే త‌ప్ప ఈ ఊహాగానాల‌ను ఖండించ‌డం కానీ, వాటికి ఊతంగా స్పందించ‌డం కానీ జ‌ర‌గ‌డం లేదు. సిగ్గుతో కూడిన నవ్వుల‌తో స్పందిస్తోంది ఈ జంట‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?