కిక్ 2 సినిమాపై హీరో రవితేజ అనాసక్తిగా వున్నాడా? ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత కళ్యాణ్ రామ్ కు, ఇటు హీరో రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డికి మధ్య ఏదో సమస్య వుందని టాక్.
అది దేని గురించి, ఫైనాన్షియల్ మ్యాటరా అన్నది తెలియదు కానీ, దానివల్ల ఈ ఇద్దరు సినిమాపై కాస్త అనాసక్తిగా వున్నారని వినికిడి. 21న సినిమా విడుదల అన్నది కూడా నిర్మాత కళ్యాణ్ రామ్ సోలోగానే డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ నెల 14న కిక్ 2 అడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేయాలని కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నారు. మరి దానికి రవితేజ, సురేందర్ రెడ్డి హాజరు కావాల్సి వుంటుంది. ముగ్గురి నడుమ కాస్తయినా టెంపరరీ ప్యాచప్ సాధ్యమైతే ఈ ఫంక్షన్ జరుగుతుంది. లేదంటే లేదు.