శిల్పకళా వేదికపై మెగా వేడుకలు

మెగాస్టార్ పుట్టిన రోజు. అందునా షష్టిపూర్తి పుట్టిన రోజు. ఆ రోజుతో మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ అవుతారు. అంటే సీనియర్ సిటిజన్ అన్నమాట. అందుకే ఈ పుట్టిన రోజును గ్రాండ్ గా జరపాలని…

మెగాస్టార్ పుట్టిన రోజు. అందునా షష్టిపూర్తి పుట్టిన రోజు. ఆ రోజుతో మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ అవుతారు. అంటే సీనియర్ సిటిజన్ అన్నమాట. అందుకే ఈ పుట్టిన రోజును గ్రాండ్ గా జరపాలని అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

శిల్పకళావేదికపై సాయంత్రం నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. అర్థరాత్రి కేక్ కటింగ్ వుంటుంది. ఆ టైమ్ కు కాస్త ముందుగా చిరు అక్కడకు వస్తారు. చిరు వెంట రామ్ చరణ్ ఎలాగూ వుంటారు. మరి ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారో చూడాలి.

తెల్లవారు ఝామున బాహుబలి, శ్రీమంతుడు షోలు వారి వారి అభిమానులకు సందడిగా మారితే, ఈ అర్థరాత్రి పార్టీ చిరు అభిమానులకు పండగగా మారనుంది. మరి ఈ ఫంక్షన్ లో చిరు తన సినిమా వివరాలు వెల్లడిస్తారా అన్నది చూడాలి.