కిర్రాక్ పార్టీ నుంచి రాజు సుందర్ అవుట్

పురిటిలోనే సంధి అంటే ఇదే నేమో? ఎకె ఎంటర్ టైన్ మెంట్స్- నిఖిల్ కాంబినేషన్ లో తలపెట్టిన కిర్రాక్ పార్టీ తెలుగు వెర్షన్ కు దర్శకుడు మారిపోయారు. సినిమా స్టార్ట్ కాకుండానే దర్శకుడు రాజు…

పురిటిలోనే సంధి అంటే ఇదే నేమో? ఎకె ఎంటర్ టైన్ మెంట్స్- నిఖిల్ కాంబినేషన్ లో తలపెట్టిన కిర్రాక్ పార్టీ తెలుగు వెర్షన్ కు దర్శకుడు మారిపోయారు. సినిమా స్టార్ట్ కాకుండానే దర్శకుడు రాజు సుందరం ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నారు.

కన్నడంలో పెద్ద హిట్ అయిన కిర్రాక్ పార్టీని తెలుగులో చేయాలని ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్ణయించింది. స్క్రిప్ట్ ను యంగ్ డైరక్టర్ చందు మొండేటి రెడీ చేసారు. ఈ సినిమాను డైరక్ట్ చేయడానికి ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం ఆసక్తి కనబర్చారు.

కానీ ఇప్పుడు ఏమయిందో తెలియదు కానీ, ఆ ప్రాజెక్టు నుంచి రాజు సుందరం తప్పుకున్నారు. ఎవరు డైరక్టర్ అన్నిది సమస్య. చందు మొండేటి ని డైరక్ట్ చేయమంటే తనకు వీలు కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ రీమేక్ చేసిన తరువాత మళ్లీ రీ మేక్ చేస్తే, తనకు అదే బ్రాండ్ పడుతుందని చందు చెప్పినట్లు తెలుస్తోంది. అదీ కాక చైతన్య సినిమా వున్నందున వీలు కాదని అన్నట్లు వినికిడి.

దీంతో చందు దగ్గర అసోసియేట్ గా వున్న ఓ కొత్త కుర్రాడితో బండి లాగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపై చందు స్క్రిప్ట్ ప్లస్ సూపర్ విజన్ ఎలాగూ వుంటుంది. కేశవ సినిమా తరువాత నిఖిల్ సినిమా ఏదీ ఇంకా స్టార్ట్ కాలేదు. మిగిలిన హీరోలు అంతా ప్రాజెక్టు ఫినిష్ అవుతుండగానే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుంటే, నిఖిల్ మాత్రం ఆ విధంగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకో?