“వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో.. 2003లో విడుదలైన `వెంకీ` చిత్రం రైటర్‌గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుండి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. నాకు తెలియకుండా.. నా సక్సెస్‌ల్లో వైజాగ్ కీలకపాత్ర పోషించింది. అలా వైజాగ్‌తో సెంటిమెంటల్‌గా అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు వైజాగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న నీవెవరో కూడా సూపర్ హిట్ అవుతుంది.”
ఇలా తన వైజాగ్ సెంటిమెంట్ కు నీవెవరో చిత్రానికి లింక్ పెట్టాడు నిర్మాత కమ్ రచయిత కోన వెంకట్. కానీ అతడి సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. నీవెవరో చిత్రం విశాఖ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినప్పటికీ సినిమా మాత్రం పెద్దగా రెస్పాన్స్ రాబట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే హిట్ అయ్యే మెటీరియల్ ఈ సినిమాలో లేదు. ఇదే సినిమాను మరో సెంటిమెంట్ తో కూడా ముడిపెట్టాడు కోన.
“నేను హీరోలకు ఫస్ట్ టైమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. అదే సెంటిమెంట్‌తో చెబుతున్నాను. ఆదికి ఈ సినిమాతో గొప్ప కెరీర్ దొరుకుతుంది.”
ఇలా కోన వెంకట్ చెప్పిన మరో సెంటిమెంట్ కూడా నీవెవరో సినిమాతో పనిచేయలేదు. ముందే ఊహించేలా ఉన్న ట్విస్టులు నీవెవరో చిత్రాన్ని పేలవంగా మార్చేశాయి. దీంతో కోన చెప్పిన రెండు సెంటిమెంట్లు ఈ సినిమా విషయంలో వర్కవుట్ కాలేదు. మరోవైపు హీరోగా సక్సెస్ కొడదామనుకున్న ఆది పినిశెట్టి ఆశలకు కూడా గంటికొట్టింది ఈ సినిమా.