కొన్ని ప్రయత్నాల తర్వాత అనుకున్నది సాధించకపోతే మన లోపాలన్నీ తెలుస్తాయి. వాటిని సరిచేసుకుని మళ్ళీ ప్రయత్నించడం సహజం. తేనెకళ్ళతో తమలపాకు లాంటి అందాలతో తెలుగు తెరపై కొన్ని సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ గొప్పగా క్లిక్ అవ్వలేదు. హిందీలో సల్మాన్‌ఖాన్ మనసుపడి అవకాశం ఇచ్చిన స్నేహా ఉల్లాల్ గ్రేట్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పోలికలతో వుంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే తెలుగులోనూ అవకాశాలూ ఇచ్చారు.
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో తళుక్కున మెరిసింది. అల్లరి నరేష్‌తో ‘యాక్షన్ 3డి’ సినిమాలో చేసింది కానీ గుర్తింపు రాలేదు. మంచు మనోజ్‌తో ‘నేను మీకు తెలుసా’లో చేసినా ఎక్కడో లోపం.. ఏంటది? నా సినిమాలు ఎందుకు హిట్ ఇవ్వడంలేదు.. అని పరిశోధనలో పడిపోయింది. తన లోపాలు ఏంటో తెలుసుకుందట. ముఖ్యంగా కాస్త కండపట్టిన శరీరంతోపాటు కళ్ళల్లో మెచ్యూరిటీ కూడా వుండాలని తెలుసుకుందట.
కొన్నాళ్ళు సినిమాలు పక్కన పెట్టి తనని తాను మలచుకునే పనిలో పడిపోయి.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు కొత్త అవతారంతో ఫొటో సూట్ చేయించుకుని ప్రయత్నాలు ప్రారంభించిందట. ఇప్పుడు స్నేహా ఉల్లాల్ గతంలో కన్నా హాట్‌గా కొత్త అందాలు సంతరించుకుని కనిపిస్తుందట. ఆవిడ రెండో అదృష్టం ఎలా వుంటుందో చూడాలి.