ఆడవాళ్ళకు ఆడవాళ్ళే పోటీ అంటారు. ఒకరి అందాలను ఇంకొకరు సహించలేరు. సినిమా షూటింగ్ అన్నాక అనేకమంది అందగత్తెలు పాల్గొంటారు. అయితే వాళ్ళు వచ్చి నటించి కామ్‌గా వుంటే ఫర్వాలేదు. పదిమందినీ ఆకర్షించడానికి సెట్‌లో ఓవర్‌గా ప్రవర్తిస్తే సహించలేనంటుంది హీరోయిన్ తమన్నా.
ఇటీవల ఒక షూటింగ్‌లో పెళ్ళి సీన్‌లో పాల్గొనడానికి కొంతమంది మోడల్స్ వచ్చారట. వాళ్ళతోపాటే పనీ పాటా లేని వాళ్ళ బోయ్‌ఫ్రెండ్స్ కూడా విచ్చేశారట. షాట్ గ్యాప్‌లో తమన్నా దృష్టిలో పడేలా వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్ ఒళ్ళో కూర్చోవడం, ఒకే కుర్చీలో ఒదిగిపోవడం, ఇంచుమించి పార్కుల్లో ప్రేమికుల్లాగా ప్రవర్తిస్తుంటే తమన్నాకు చిర్రెత్తుకొచ్చిందట. వాళ్ళేమో కావాలనే తమన్నాను అసూయపడేలా చెయ్యాలని ప్లాన్ చేసుకుని వుండొచ్చు.
దాంతో మేనేజర్‌ని పిలిచి సెట్‌లో అలా ఇన్‌డీసెంట్‌గా వుంటే మర్యాద కాదని చెప్పమందట. మేనేజర్ హెచ్చరించాక మోడల్స్ కాస్త తగ్గారట. పబ్లిక్‌గా అమ్మాయిలు అలా ప్రవర్తిస్తే ఒక్క తమన్నాకే కాదు, చూసేవాళ్ళకూ టెంపర్ లేస్తుంది. మోడల్స్ అయినా ఇంకెవరైనా హద్దుల్లో వుంటే మంచిది. ఏదైనా వుంటే నాలుగ్గోడల మధ్య చూసుకోవచ్చు కదా.!