ఎవరెన్ని కబుర్లు చెప్పినా, టాలీవుడ్ లో ఎవరి దుకాణం వారిది..ఎవరి ఇగో వారి..ఎవరి భజన వ్యవహారం వారిది. కానీ తెలివైన వారు ఈ ఫీల్డ్ లో 'నొప్పివ్వక..తానొవ్వక..తప్పించుకు తిరుగువాడు..ధన్యుడు' అన్న స్టయిల్ లో సాగుతుంటారు. ప్రతి స్టేజ్ మీద ప్రతి ఒక్కరిని పొగడ్డమే పనిగా సాగిపోతారు. అంతే కానీ వీడొక్కడే మొనగాడు..వీడే మొనగాడు అని మాత్రం అనరు. కానీ పూరి జగన్నాధ్ చుట్టూ చేరుతున్న జనం మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా వాళ్లు అండర్ కరెంట్ గా పూరికి కీడు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
టెంపర్ సినిమా సంగతి అలా వుంచితే, దాని విడుదల ముందు వరకు పూరి చేతిలోమరో సినిమా లేదు. మెగా హీరోలు దగ్గరకు రానిస్తున్నారో, రానివ్వడంలేదో కానీ, సినిమాలు అయితే లేదు. నాగబాబు కొడుకు సినిమా వుంటే వుండొచ్చు. మహేష్ బాబు చాన్సిస్తాడా ఇవ్వడా అన్నది ఎసిడిసి వ్యవహారం. ఇంక సరైన హీరో మరెవరున్నారు. మళ్లీ నితిన్ ను పట్టుకోవాల్సిందే.
అలాంటి నేపథ్యంలో పూరి జగనాధ్ కు అత్యంత సన్నిహితుడు రామ్ గోపాల్ వర్మ మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ను మించిన నటుడు లేడు..సీనియర్ ఎన్టీఆర్ దిగదుడుపే..అహో..అద్భుతం అని మొదలుపెట్టారు. ఇది పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మిగిలిన హీరోలకు మండించదా..అసలే ఆగడు సినిమా సమయంలో రామ్ గోపాల్ వర్మ కామెంట్లు ఇంకా మహేష్ కు కాకున్నా, ఆయన ఫ్యాన్స్ కు మండిస్తూనే వున్నాయి.
నిన్నటికి నిన్న ప్రకాష్ రాజ్..టెంపర్ సినిమాలో పాత్ర ఎన్టీఆర్ తప్ప, దేశంలో మరెవరు చేయలేరన్నంతగా మాట్లాడాసారు. ఆగడు సినిమా నుంచి బయటకు వచ్చాక ప్రకాష్ రాజ్ మళ్లీ అటు వెళ్లలేదు. మరోపక్క టెంపర్ భూమి బద్దలు కొట్టిందన్న రీతిలో పార్టీలు..అసలే ఇంకా డిస్ట్రిబ్యూటర్లు చాలా జిల్లాల్లో కోలుకోలేదని వార్తలు వినవస్తున్నాయి. గడచిన రెండు రోజులుగా కొన్నిజిల్లాల్లో డెఫిసిట్ నడుస్తోందని మరో టాక్.
ఇక దాసరి..టాలీవుడ్ లో మరే డైరక్టర్ పనికిరాడన్నట్లు కితాబులు. ఇలా అందరూ కలిసి చేస్తున్న కామెంట్లు, ప్రకటనలు మిగిలిన వారికి పూరికి దగ్గర చేస్తాయా? దూరం చేస్తాయా? అన్నది అనుమానం. పూరి చుట్టు వున్న వారిలో కొందరు..ఏదో గడిపేస్తున్నాం అనో కనిపించేటైపే ఎక్కవ. మరి తమ ఫ్రెండ్ పూరి ఎందుకు పచ్చగా వుండాలి. తమ లెవెల్ కు దిగిపోవాలి కానీ, అని ఇలాంటి భజన చేసి, ఆయన అవకాశాలు చెడగొట్టాలని నిర్ణయించుకున్నట్లుంది.