సర్దార్ గబ్బర్ సింగ్ ఓ హడావుడి ప్రయత్నం. చివరి ముఫై రోజుల్లోనే 70శాతం సినిమా చుట్టేసామని పవన్ నే చెప్పాడు. పాటలు పవన్ తన హీరోయిన్ ను, కెమేరా మెన్ ను తీసుకువెళ్లి ఏ విధంగా తీసుకువచ్చాడో సినిమా చూసిన వాళ్లకు అర్థం అయింది.
ఇదిలా వుంటే సినిమాలో కొన్ని సీన్లకు పవన్ డబ్బింగ్ కూడా చెప్పలేదని టాలీవుడ్ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా షూటింగ టైమ్ లో డైలాగులు రికార్డు అవుతాయి కానీ, ఆ సౌండ్ ట్రాక్ స్థానంలో డబ్బింగ్ సౌండ్ ట్రాక్ ఫిక్స్ చేస్తారు.
అయితే టైమ్ లేక, కొన్ని సీన్లకు షూటింగ్ టైమ్ లో రికార్డు చేసిన సౌండ్ ట్రాక్ నే వుంచేసారని వినికిడి. గతంలో తీన్ మార్ సినిమాకు కూడా చాలా శాతం పవన్ ఇలాగే చేసాడట. మళ్లీ అదే ప్రయోగం ఇక్కడా చేసాడన్నమాట. అందువల్లే కొన్ని డైలాగులు బాగున్నా, తెరపై అంత ఇంపాక్ట్ కనిపించలేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి.