సంపత్ నంది లక్కీ ఫెలో

సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం చూసిన వాళ్లంతా సంపత్ నంది లక్కీ ఫెలో అంటున్నారు. సంపత్ నందిని రీప్లేస్ చేయకుండా వుండి వుంటే, ఇప్పటి దాకా ఆయన అక్కడే గింగిరాలు తిరుగుతూ వుండేవాడు. ఇఫ్పుడు…

సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం చూసిన వాళ్లంతా సంపత్ నంది లక్కీ ఫెలో అంటున్నారు. సంపత్ నందిని రీప్లేస్ చేయకుండా వుండి వుంటే, ఇప్పటి దాకా ఆయన అక్కడే గింగిరాలు తిరుగుతూ వుండేవాడు. ఇఫ్పుడు బాబి పరిస్థితే ఆయనకు వుండేది. సినిమా ఫలితం తరువాత సంపత్ కు మళ్లీ సినిమా రావాలంటే మరో ఏడాది పట్టే పరిస్థితి వుండేది.బయటకు వచ్చి రవితేజతో బెంగాల్ టైగర్ తీసాడు. హిట్ అనిపించుకున్నాడు. ఇఫ్పుడు ఎవరైనా చాన్స్ ఇచ్చే అవకాశం వుంది. సో ఆ విధంగా సంపత్ నంది లక్కీ.

అక్షరం వాడలేదట

సంపత్ నందికి కథ నెరేట్ చేసాడు పవన్. దానికి తన స్టయిల్ సీన్లు అల్లి స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చాడు. నచ్చిందో, నచ్చలేదో మరి ఆయనను మార్చేసాడు పవన్. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, సంపత్ నంది తయారు చేసిన సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా వాడలేదని. సంపత్ అల్లిన సీన్లు అన్నీ రెగ్యులర్ ఫార్మాట్ లో, రిస్క్ ఫ్రీగా వున్నాయని వినికిడి. 

అంటే రచ్చ, బెంగాల్ టైగర్ కు కూడా సంపత్ అదే స్టయిల్ అనుసరించాడు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక. కానీ అది పవన్  కు నచ్చక సంపత్ కు చెప్పిన కథే బాబికి కూడా చెప్పి, వేరే నెరేషన్ రాయించి వుంటారు  అని తెలుస్తోంది. లేదా మరో ముగ్గురు రైటర్లు కూడా పని చేసారు కాబట్టి, వారు అందరూ కలిసి ఈ కొత్త సీన్లు అల్లి వుంటారు.

మొత్తానికి ఏమయితేనే ఒకటే క్వశ్చన్ పేపర్ కు రెండు ఆన్సర్ షీట్లు తయారు చేయించారు. అందులో ఒకటి ఈ రోజు బయటకు వచ్చింది. సంపత్ రాసిన ఆన్సర్ షీట్ కూడా తెలిస్తే ఏది బెటర్ వెర్షన్ అని తెలిసే అవకాశం వుండేది.