మెగాక్యాంప్ గా పేరు పడిన చిరు ఫ్యామిలీ సభ్యుల సినిమాలకు వరుస దెబ్బలు తగులుతున్నాయ్. బ్రూస్ లీ సినిమాతో రామ్ చరణ్ గట్టి దెబ్బతిన్నారు. ఇటు ఇండియాలో, అటు ఓవర్ సీస్ లో బ్రూస్ లీ కారణంగా బయర్లు దారుణంగా నష్టపోయారు. అంతకు మించి బ్రూస్ లీ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను డామేజ్ చేసింది. చిరంజీవి చాలా కాలం తరువాత తెరపై కనిపిస్తున్నారని తెలిసినా ఏ మాత్రం స్పందన లేకపోయింది. అది రెండో దెబ్బ. దాని వైనం పై డిస్కషన్లు చేసి, తేరుకోవడానికే నెలలు పట్టింది.
ఇప్పుడు ముచ్చటగా మూడో దెబ్బ సర్దార్ గబ్బర్ సింగ్. నిజానికి పవన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. ఏ మాత్రం బాగున్నా సినిమా లాగేస్తుందన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్. అన్ని చోట్లా శ్రీమంతుడు రికార్డును కొట్టేయాలన్న పట్టుదల తెరవెనుక కనబర్చారు. కానీ ఇప్పుడు ఫలితం దక్కేలా లేదు.
ఇటీవలి కాలంలో భాహుబలి తరువాత అంత హైప్ వచ్చిన సినిమా సర్దార్. కానీ ఫలితం వేరుగా వుంది. 95 కోట్ల మేరకు వ్యాపారం చేసారు ఈ సినిమాతో. థియేటర్ల వారీ కొనుక్కున్నవారు మిగిలారు..వారు ఏమేరకు డబ్బులు రాబట్టుకుంటారో చూడాలి.
ఇక బన్నీ సరైనోడు మిగిలింది. అయితే దానికి డైరక్టర్ బోయపాటి శ్రీను. పైగా దాని వెనుక అల్లు అరవింద్ మాస్టర్ బ్రెయిన్ వుంది. అందువల్ల ఆ సినిమా మరీ ఈ సినిమాల్లా డిజాస్టర్ అయితే కాదు. అందువల్ల అదొక్కటే మెగా క్యాంప్ కు ఊరట కావచ్చు.