కొరటాల-బన్నీ ప్రాజెక్టు ఓకె అవుతుందా?

కొరటాల శివ తరువాతి సినిమా రామ్ చరణ్ తో వుండాలి. నిరంజన్ రెడ్డి నిర్మాత. కానీ అనుకోని కొత్త ఈక్వేషన్లు తెరపైకి రావడంతో, ఆ సినిమా డైలామాలో పడింది. ఈలోగా బన్నీ తో కొరటాల…

కొరటాల శివ తరువాతి సినిమా రామ్ చరణ్ తో వుండాలి. నిరంజన్ రెడ్డి నిర్మాత. కానీ అనుకోని కొత్త ఈక్వేషన్లు తెరపైకి రావడంతో, ఆ సినిమా డైలామాలో పడింది. ఈలోగా బన్నీ తో కొరటాల శివ అన్న కొత్త కాంబినేషన్ పుట్టుకువచ్చింది. ఈ మేరకు ఒకటి రెండు సిటింగ్ లు జరిగినట్లు తెలుస్తోంది. కానీ సెట్ అవుతుందా అన్నదే అనుమానం.

ఎందుకంటే కొరటాల కథల స్టయిల్ బన్నీకి అంతగా నచ్చదు అన్నది వాస్తవం. కొరటాల శివ గతంలో కూడా బన్నీకి కథలు చెప్పారు కానీ అవేవీ బన్నీకి నచ్చలేదు. అలాంటి కథల్లో శ్రీమంతుడు ఒకటి. ఆ ప్రాజెక్టు బన్నీ వద్దంటేనే మహేష్ దగ్గరకు వెళ్లింది. బన్నీకి కొన్ని కథలే నచ్చుతాయి. కొన్ని నచ్చవు. అందువల్ల ఈసారి అయినా కొరటాల శివ కథ చెప్పి, బన్నీని నప్పించగలుగుతాడా? అన్నది అనుమానం. 

కొరటాల శివ కాకపోతే కనుక, బన్నీ ఓ సినిమా మారుతి డైరక్షన్ లో చేసే అవకాశం వుంది. లైన్ ఒకె అయివుంది ఎప్పుడో. ఎటొచ్చీ బన్నీకి-మారుతికి ఒకేసారి సెట్ కావడం లేదు. ఒకవేళ బన్నీ కనుక కొరటాల సినిమా మీదకు వెళ్లకుండా, నాగ చైతన్య సినిమా తరువాత మారుతి సినిమా పట్టాలు ఎక్కువచ్చు. అలా అయితే సాయిధరమ్-మారుతి సినిమా కాస్త వెనక్కు వెళ్తుంది. చూడాలి మరి బన్నీ ఏం నిర్ణయం తీసుకుంటాడో?