ఎన్టీఆర్-కొరటాల శివ-మైత్రీమూవీస్ సినిమా అంటే చాలు..హైప్ ఓ రేంజ్ లో వుంటుంది. అంచనాలు అంతకన్నా పైన వుంటాయి. మిర్చి, శ్రీమంతుడు ప్లస్ ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఎఫెక్ట్ అది. అయినా కూడా మైత్రీ మూవీస్ నిర్మాతలు తమ సినిమా బడ్జెట్ నలభై నుంచి నలభై అయిదు దాటకూడదని అనుకుంటున్నారట.
ఎన్టీఆర్ కు వున్నబాక్సాఫీస్ లెక్కలు ఇప్పటికి నలభై కి కాస్త అటు ఇటుగానే చక్కర్లు కొడుతున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా, నలభై అయిదు దాటలేకపోతోంది. పోనీ మైత్రీ ఇమేజ్..శివ పేరు కలిసి అమ్మకాలు అరవై, డెభై అయిపోవచ్చు..కానీ సినిమా స్టామినా ఆ మేరకు లేకపోతే..ఇప్పటికే నాలుగు సినిమాలకు వరుసగా ఎన్టీఆర్ పుణ్యమా అని బయ్యర్లు బలైపోయారు.
సో..ఎన్టీఆర్ సినిమాను అమ్మితే నలభై అయిదు రేంజ్ లో అమ్మాలి. ఆపైన శాటిలైట్ వుంటుంది. అందుకే కొరటాల శివకు మైత్రీ మూవీస్ అధినేతలు నలభై నుంచి నలభై అయిదు మధ్యలో పబ్లిసిటీతో కలిపి సినిమా పూర్తి చేయాలని డైరక్షన్ ఇచ్చారని టాలీవుడ్ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి.