కొసరు రేయ్..అసలు సత్యమూర్తి

చిరంజీవి అభిమానులు ఈ రోజు హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. ఎందుకు అన్న ప్రశ్న రావడం సహజం కానీ, మెగా ఫ్యామిలీ సినిమాల ముందు ఇలాంటి సమావేశాలు మామూలే.  Advertisement హార్డ్ కోర్ అభిమానులను…

చిరంజీవి అభిమానులు ఈ రోజు హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. ఎందుకు అన్న ప్రశ్న రావడం సహజం కానీ, మెగా ఫ్యామిలీ సినిమాల ముందు ఇలాంటి సమావేశాలు మామూలే. 

హార్డ్ కోర్ అభిమానులను పిలవడం,  విందు చేయడం, సినిమా హిట్ కు సహకరించాలని కోరడం మామూలే. కానీ ఈ సారి మాత్రం చిన్నట్విస్ట్ వుందని వినికిడి. ఈ సమావేశం నిజానికి కొన్ని రోజుల తరువాత జరగాలి. అది కూడా సన్నాఫ్ సత్యమూర్తి కొసం. 

కానీ ఇప్పుడు రేయ్ కూడా సీన్ లో వుంది. ఇప్పుడు మీటింగ్ పెట్టకుండా, తరువాత సమావేశం పెడితే బాగుండదు. ఈ సినిమా వదిలేసారన్న టాక్ వస్తుంది. అందుకే ఇప్పుడే సమావేశం పెట్టి, రేయ్ గురించి ఓ మాట అనేసి, ఆపై ఫోకస్ అంతా సత్యమూర్తిపై పెట్టాలన్నది అసలు ఐడియానంట.