Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నా గోల్డ్ దుకాణాలు

తమన్నా గోల్డ్ దుకాణాలు

తమన్నా భాటియా..కాజల్ అగర్వాల్..ఇలా నార్త్ అమ్మాయిల్లో చాలా మంది వ్యాపార కుటుంబాల నేపథ్యం వున్నవారే. వాళ్ల కుటుంబాలు వ్యాపారంలో వుండకపోవచ్చు..కానీ బ్లడ్ ఎక్కడికి పోతుంది. ఇప్పుడు తమన్నా కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోంది. 

సాధారణంగా హీరోయిన్ల వ్యాపారం అంటే బొటిక్ లే గుర్తుకు వస్తాయి. తక్కవ పెట్టుబడి..ఎక్కువ లాభం. కానీ తమ్మూ అందుకు విభిన్నంగా భారీ పెట్టుబడి అవసరమైన బంగారు నగల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారమ్. 

వైట్ అండ్ గోల్డ్ పేరుతో చైన్ దుకాణాలు ఏర్పాటు చేస్తుందట. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, ముంబాయి పట్టణాలు లిస్టులోవున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ తమ్మూ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?