మాటలు, డైరక్షన్ కూడా విష్ణేనట

సింగమ్ 123 అంటూ సంపూ బాబుతో చకచకా ఓ సినిమా లాగించేస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణే అన్నది అఫిషియల్. అయితే నిజానికి చాలా వరకు మాటలు…

సింగమ్ 123 అంటూ సంపూ బాబుతో చకచకా ఓ సినిమా లాగించేస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణే అన్నది అఫిషియల్. అయితే నిజానికి చాలా వరకు మాటలు విష్ణే అందించాడని, డైరక్షన్ కూడా తానే చేసాడన్నది అనఫిషియల్. 

నిజానికి అజయ్ శర్మ అనే అతని పేరు దర్శకుడిగా వుంది కానీ, విష్ణే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడని వినికిడి. తొలి సినిమా డైరక్షన్ అన్నది గ్రాండీగా వుండాలని, అందువల్ల ఈ సినిమాను జస్ట్ ట్రయిల్ రన్ గా వాడుకోవాలన్నది విష్ణు ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ చూసి, తరువాత తనతోనో, తమ్ముడితోనో  డైరక్షన్ లోకి అడుగుపెట్టే అవకాశం వుంది.