కొత్తకారు..కొత్త ఫిజిక్

వరుస మూడు హిట్ లతో నిఖిల్ పని భలే జోరుగా వుంది. అందునా అమెరికా వెళ్లి  ఇటు ఫిట్ నెస్ ట్రయినింగ్, అటు అడ్వాన్స్ డ్ ఏక్టింగ్ కోర్సు చేసి వచ్చాడు. అలాగే అయిదు…

వరుస మూడు హిట్ లతో నిఖిల్ పని భలే జోరుగా వుంది. అందునా అమెరికా వెళ్లి  ఇటు ఫిట్ నెస్ ట్రయినింగ్, అటు అడ్వాన్స్ డ్ ఏక్టింగ్ కోర్సు చేసి వచ్చాడు. అలాగే అయిదు కిలోల బరువు పెరిగి కొత్త ఫిజిక్ సంతరించుకున్నాడు. దీనికి తోడు చాలా మంది నిర్మాతలు ఇప్పుడు నిఖిల్ వైపు చూస్తున్నారు. 

కానీ అతగాడేమో సరైన కథ కోసం చూస్తున్నాడు. ఇప్పటికి కోనవెంకట్ శంకరాభరణం ఒక్కటే కమిట్ అయ్యాడు. అది జూన్ రెండో వారంలో ప్రారంభం అవుతుంది. దీనికి ఓ హిందీ సినిమా ఆధారం అని వినికిడి. 

ఇదిలా వుంటే జూన్ 1 నిఖిల్ బర్త్ డే. ఈ బర్త్ డేకి తనకు తానే ఓ మాంచి స్పోర్ట్స్ కారును గిఫ్ట్ గా ఇచ్చుకుంటున్నాడు. మెర్సిడెస్ కంపెనీ స్పోర్ట్స్ కారును ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.