నందమూరి హీరోతో కథనాయకుడు, మహానాయకుడు సినిమా తీసి తన ఇమేజ్ మొత్తం డౌన్ చేసకున్నారు దర్శకుడు క్రిష్. ఆ సినిమాల తరువాత మళ్లీ సినిమా రావడం అన్నది గగనంగా మారింది. ఇలాంటి టైమ్ లో ఎఎమ్ రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా వచ్చింది. నిజానికి ఇది ఓ ఫాంటసీ టచ్ వున్న పీరియాడికల్ స్క్రిప్ట్.
అయితే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు బోగట్టా. ఈ స్క్రిప్ట్ లో కనిపించీ కనిపించకుండా, తెలిసీ తెలియకుండా వర్తమాన రాజకీయ పరిస్థితులను మిక్స్ చేయబోతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సినిమాలోని విలన్ పాత్రలో ఆంధ్రలోని ఓ కీలక రాజకీయ నాయకుడి ఛాయలు వుండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా చూస్తుంటే జనాలు వారంతట వారు పోల్చుకుని చూసుకునేలా మాదిరిగా వుండాలని, డైరక్ట్ గా వుండకూడదని పవర్ స్టార్ సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు దర్శకుడు క్రిష్-రచయిత బుర్రా సాయి మాధవ్ కలిసి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలో ఆంధ్రలోని జనాల అభిమాన నాయకుడి షేడ్స్ చేర్చుతుండడంతో, ఇక్కడి నటులను కాకుండా బాలీవుడ్ నటుడిని తీసుకుంటే బెటర్ అని కూడా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి క్రిష్ పూర్తిగా పొలిటికల్ గా ఓ సైడ్ తీసేసుకుంటున్నట్లు కనిపిస్తోంది తన సినిమాల ద్వారా. ఏవిషయమూ ఈ సినిమా తయారై జనాల్లోకి వస్తే, క్లారిటీగా తెలుస్తుంది.