పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు ఓకె చేస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ సెట్ మీద వుంది. ఇందుకోసం ఓ నెల రోజులు అయినా ఇంకా వర్క్ వుంది. ఇందులో పది హేనురోజులు పవన్ వర్క్ చేయాల్సి వుంది. ఆ తరువాత వరుసగా మూడు సినిమాలు ఓకె చేసారు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు వున్నాయి. ఇది కాక మరో సినిమా సెట్ చేయడానికి కూడా డిస్కషన్లు జరుగుతున్నాయి. అది కాక హారిక హాసిని లేదా సితారలో ఎప్పుడైనా వెైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటి వుండే అవకాశం వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఎవరి సినిమా ముందు, ఎవరి సినిమా వెనుక అన్నది కీలకంగా మారింది. హరీష్ శంకర్-క్రిష్ సినిమాల్లో ఎవరిది ముందు అన్నది పాయింట్. క్రిష్ డైరక్షన్ లో సినిమా ఓ చిన్న షెడ్యూలు జరుపుకున్న మాట వాస్తవం. కానీ క్రిష్ ఇప్పుడు తన నిర్మాణంలో వేరే సినిమా చేస్తున్నారు. అది పూర్తి చేసుకుని వచ్చే వరకు పవన్ వెయిట్ చేస్తారా?
పవన్ కు టైమ్ పడుతుందనే క్రిష్ వేరే సినిమా మీదకు వెళ్లారు. కానీ హీరోలు అలా భావించరు. తమకోసం వెయిట్ చేయలేనివారిని మరింత వెయిట్ చేసేలా చేసే అవకాశం వుంది. పైగా జరిగిన ఫస్ట్ షెడ్యూలు మీద పవన్ కు వేరే రకమైన ఫీడ్ బ్యాక్ వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ షెడ్యూలు పేమెంట్లు ఆలస్యం అయ్యాయని పవన్ కు ఫీడ్ బ్యాక్ అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎ ఎమ్ రత్నంకు సినిమా అయితే తప్పకుండా చేస్తారు.
కానీ హరీష్ శంకర్ సినిమా తరువాతనా? ముందునా? అన్నది తెలియాల్సివుంది. ఇక్కడ ఇంకోసమస్య కూడా వుంది. క్రిష్ సినిమా అంతా గ్రీన్ మ్యాట్ వ్యవహారం. సినిమా తొలిసగం దొంగగా, ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు బానిసలను కాపాడే వీరుగా, మలిసగంలో సంస్థాన వారసుడిగా ఇలా మల్టీ షేడ్ లు వుంటాయి పవన్ క్యారెక్టర్ లో అని తెలుస్తోంది. పైగా యాక్షన్ సీన్లు బాగా గట్టిగా వుంటాయి. రామ్ లక్ష్మణ్ లు వర్క్ చేస్తున్నారంటే ఆ మాత్రం వుంటాయి కూడా.కానీ అన్నీ సిజి షాట్ లే తప్ప, వైర్ లు కట్టి లాగడం లాంటివి వుండవు అని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ శరీరం అందుకు సహకరించకపోవచ్చు.
కానీ హరీష్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్. కొద్దిగా యాక్షన్. అందువల్ల అది ఫాస్ట్ గా తయారయ్యే అవకాశం వుంది. అయితే క్రిష్ సినిమాకు పిఎస్ పికె 27 అని నెంబర్ ఇచ్చేసారు. మరి మైత్రీ జనాలు ఏవిధంగా అప్ డేట్ ఇస్తారో చూడాలి. ఈ సాయంత్రం మైత్రీ-హరీష్ శంకర్ సినిమా హీరోయిన విషయం అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది. పూజా హెగ్డే ను హీరోయిన్ గా అనౌన్స్ చేసే అవకాశం వుంది.