సూపర్ స్టార్ రజనీ కాంత్ లింగా డిసెంబర్ 12న ఖరారైపోయింది. సంక్రాంతికి ఐ వస్తానంటోంది. వీటి మధ్యలో కనీసం అరడజను పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నితిన్ 'చినదాన నీ కోసం'.. వరుణ్ తేజ 'ముకుంద' డిసెంబర్ ఆఖరు వారానికి ఫిక్సయిపోయినట్లే.
మొదటి వారానికి ఎన్టీఆర్-పూరి సినిమా రుమాలు వేసేసింది. సంక్రాంతికి గోపాల గోపాల నేను రెడీ అంటోంది. ఇటు లింగా అటు ఐ సినిమా జోరు ఓ రేంజ్ లో వుంది. లింగా సినిమా ఒక్క సీడెడ్ హక్కులే 7.2 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇందులో 1.2 కోట్లు రిటర్న్ గ్యారంటీ. అంటే రజనీ క్రేజ్ ఏ మేరకు వుందో అర్థమవుతుంది.
ఇక ఐ కూడా తక్కువ తినలేదు. 30 నుంచి 35 కోట్ల మధ్య హక్కుల రేటు, ప్లస్ అది రికవరీ అయిన తరవాతి మొత్తంలో యాభై శాతం అన్నది ఒప్పందంగా తెలుస్తోంది. అంటే ఐ మీదై అంచనాలు ఎలా వున్నాయో అర్థమవుతుంది. అయినా కూడా భయపడకుండా మనవాళ్లు సినిమాలు షెడ్యూలు చేసుకోవడం విశేషం.