కుటుంబ కలతలు..విసిగిపోతున్న నటి?

ఇంట్లో చిన్న చిన్న కలతలు వుంటే కాస్త మనసుకు కష్టంగానే వుంటుంది. ఇప్పుడు ఇలాగే ఫీలవుతోంది ఓ కాబోయే కోడలు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.  Advertisement టాలీవుడ్ లోని ఒక హీరోను…

ఇంట్లో చిన్న చిన్న కలతలు వుంటే కాస్త మనసుకు కష్టంగానే వుంటుంది. ఇప్పుడు ఇలాగే ఫీలవుతోంది ఓ కాబోయే కోడలు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 

టాలీవుడ్ లోని ఒక హీరోను ప్రేమించింది. అటు నుంచి కూడా డిటో డిటో. ఇలా చాన్నాళ్లు సాగింది. ఎవరు.. ఎప్పుడు ఈ సంగతి అడిగినా దాటవేతే. సరే మొత్తానికి అన్నీ కుదిరాయి. నిశ్చితార్ధం జరిగిపోయింది. పెళ్లి బకాయి వుంది. ఇలాంటి నేపథ్యంలో మనువాడబోయే వాడి ఇంట్లో చిన్న డిస్ట్రబెన్స్. అక్కడ వస్తోంది సమస్య.

ఇంట్లో తరచు వాదనలు, డిస్కషన్లు జరుగుతున్నాయట. దాంతో ఈ వాతావరణం ఈ అమ్మాయికి కాస్త ఇబ్బందిగా వుంటోందని తెలుస్తోంది. టాలీవుడ్ సంగతి తెలిసిందే కదా. 

ఇదిగో క్లాప్ అంటే అదిగో విడుదల అంటారు. ఇప్పుడు సదరు హీరోయిన్ ఈ గొడవలు అన్నీ చూసి, కాస్త విసిగిపోతోందని, తన పెళ్లి విషయంలో పునరాలోచనలో పడిందని గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైపోయింది.

నిజానికి ఈ కాలం అమ్మాయిలు ఇలాంటివి పెద్ద సీరియస్ గా తీసుకోరు. ఎవరి బతుకులు వారివి.. ఎవరి గొడవులు వారివి. తమ ఫ్యూచర్, తమ వ్యవహారం వరకే చూసుకుంటారు. అందువల్ల ఇవన్నీ గ్యాసిప్‌లు గానే వుంటాయని, త్వరలో పెళ్లి బాజాలు వినిపిస్తాయని అనుకోవడమే బెస్ట్.