Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లాంచింగ్ ఫంక్షన్ కే పాతిక లక్షలు

లాంచింగ్ ఫంక్షన్ కే పాతిక లక్షలు

డబ్బున్న కుర్రాడు హీరోగా లాంచ్ కావడం అంటే ఆ రేంజ్ నే వేరుగా వుంటుంది. అందులోనూ ఎంపీ కొడుకు, మాజీ మంత్రి మనవడు, సీనియర్ సూపర్ స్టార్ మనవడు, ఈ జనరేషన్ సూపర్ స్టార్ మేనల్లుడు. అందువల్ల ఇంక ఏ రేంజ్  వుంటుంది? గల్లా అశోక్ తెరంగ్రేటం సంగతే ఇదంతా. 

గల్లా అశోక్ తొలి సినిమా లాంచింగ్ హడావుడి ఇంతా అంతా కాదు. హేమా హేమా సినిమా అండ్ పొలిటికల్ సెలబ్రిటీలు వచ్చారు. అదంతా అలా వుంచితే ఈ ఫంక్షన్ కే పాతిక లక్షల వరకు ఖర్చు చేసారు. తొలి రోజు ఫంక్షన్ కే ఓ సెట్ లాంటిది తయారుచేసారు. ఫంక్షన్ విడియో లైవ్ కు జిమ్మీ క్రేన్ లాంటి వ్యవహారాలు జోడించారు. అది చాలక లాంచింగ్ కార్యక్రమానికి యాంకర్ ను పెట్టారు. ఇక మిగిలిన హడావుడి ఇంతా అంతా కాదు.

రామ్ చరణ్, రానా,  సుధీర్ బాబు, నరేష్, నమ్రత, అమల అక్కినేని, లాంటి సినిమా జనాలు, కేశినేని నాని, రామ్మోహన నాయుడు, లాంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మిగిలిన సినిమా జనాలు, రాజకీయ జనాల బోలెడు మంది. నిధి అగర్వాల్ హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ యాక్టింగ్ లో సత్యానంద్ దగ్గర ట్రయినింగ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ దిల్ రాజు బ్యానర్ లో ఎంట్రీ ఇవ్వాల్సిందే. కానీ స్టార్ట్ చేసి ఆపేసారు. ఇప్పుడు స్వంత బ్యానర్ స్టార్ట్ చేసి, ఎంట్రీ ఇస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?