లావణ్య త్రిపాఠి.. ఇది కొంచెం ఎక్కువైందేమో!

'నాకు నచ్చే పాత్రలు రావడం లేదు.. అందుకే వరసగా సినిమాలు చేయడం లేదు..' ఇదీ లావణ్య త్రిపాఠి స్టేట్ మెంట్. ఈ మధ్య ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. సూటిగా చెప్పాలంటే…

'నాకు నచ్చే పాత్రలు రావడం లేదు.. అందుకే వరసగా సినిమాలు చేయడం లేదు..' ఇదీ లావణ్య త్రిపాఠి స్టేట్ మెంట్. ఈ మధ్య ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. సూటిగా చెప్పాలంటే అవకాశాలు తగ్గాయి! ఈ విషయం గురించి లావణ్య ఇలా స్పందిస్తోంది!

అంత అందగత్తె కాని లావణ్యకు ఇప్పటి వరకూ మంచి అవకాశాలు వచ్చినట్టే. సైడ్ యాక్టర్ మెటీరియల్ అయిన ఈ డార్జిలింగ్ భామ… ఇప్పటి వరకూ బాగా రాణించినట్టే. మొదట్లో ఈమె సినిమాలు హిట్ కావడంతో ఆ లక్కీ చార్మ్ కలిసి వచ్చింది. అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఫెయిల్యూర్ల వల్ల లావణ్యకు అవకాశాలు మందగించాయి.

అయితే తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, కానీ వాటిల్లో పాత్రలకు అంత ప్రాధాన్యత లేకపోవడంతో తనే ఓకే చేయడం లేదని లావణ్య చెప్పుకురావడమే కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది.

ఈ భామ చెప్పుకుంటున్న మరో విషయం ఏమిటంటే, 'అర్జున్ సురవరం' సినిమాను కూడా తను చేయాలని మొదట అనుకోలేదట. తమిళంలో రూపొందిన సినిమాకు రీమేక్ కావడంతో తను ఈ సినిమాను రిజక్ట్ చేయాలనుకుందట. 'రీమేక్ సినిమాలో కొత్తగా చేయడానికి ఏముంటుంది?' అని లావణ్య ప్రశ్నించేసింది. అయితే చివరకు తను కన్వీన్స్ అయ్యిందట! 

కెరీర్ ఆరంభంలో ఒక సీన్లో కనిపించిన సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండటం కొంచెం ఓవర్ అయినట్టుగా ఉంది!