గిల్లి జోల పాడుతున్న రామ్ గోపాల్ వర్మ!

'మా సినిమాలో ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు…'  ఇదీ రామ్ గోపాల్ వర్మ ప్రకటన. 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించి వర్మ ఈ ప్రకటన చేశారు! గిల్లి జోలపాడినట్టుగా ఉంది ఆర్జీవీ ప్రకటన. తమ…

'మా సినిమాలో ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు…'  ఇదీ రామ్ గోపాల్ వర్మ ప్రకటన. 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించి వర్మ ఈ ప్రకటన చేశారు! గిల్లి జోలపాడినట్టుగా ఉంది ఆర్జీవీ ప్రకటన. తమ సినిమాలో ఎవరినీ ప్రత్యకంగా టార్గెట్ గా చేసుకోలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. 

ఈ సినిమా ఒక ఎంటర్ టైనర్ అని ఈ నెల 29న 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాను ఏకంగా ఎనిమిది వందల థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించుకున్నాడు.

మొత్తం ఏడు పాటలున్నాయని, వాటిల్లో ఇప్పటికే ఒకటి వైరల్ అయ్యిందని ఆర్జీవీ అంటున్నాడు. 'పప్పులాంటి అబ్బాయి..' పాట బాగా వైరల్ అయ్యిందని, మిగతా పాటలు కూడా హైలెట్ అవుతాయని ఆర్జీవీ అంటున్నాడు. సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందని వర్మ అంటున్నాడు. మొత్తానికి విడుదల  సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చాలా మందిని గిల్లి ఇప్పుడు జోల పాడుతున్నాడు ఆర్జీవీ.