సినిమా వాళ్ల వనభోజనాలట!

కార్తీక మాసం అయిపోవచ్చింది. వనభోజనాల హడావుడి ఇంకా కొనసాగుతూ ఉన్నట్టుగా ఉంది. కుల సంఘాల వనభోజనాలు యథారీతిన గట్టిగానే సాగుతూ ఉన్నాయి. ఈ సారి కమ్యూనిస్టు పార్టీల వాళ్లు కూడా వన భోజనాలు ఎక్కడో…

కార్తీక మాసం అయిపోవచ్చింది. వనభోజనాల హడావుడి ఇంకా కొనసాగుతూ ఉన్నట్టుగా ఉంది. కుల సంఘాల వనభోజనాలు యథారీతిన గట్టిగానే సాగుతూ ఉన్నాయి. ఈ సారి కమ్యూనిస్టు పార్టీల వాళ్లు కూడా వన భోజనాలు ఎక్కడో నిర్వహించారట. అందుకు సంబంధించి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది!

అయినా కమ్యూనిస్టులు కార్తీక మాస వన భోజనాలు నిర్వహించడం ఏమిటో. అదేమంటే, అన్ని కులాల వారూ ఆహ్వానితులేనట. ఇక నుంచి కమ్యూనిస్టులు వ్రతాలూ, లక్ష దీపార్చనలు కూడా నిర్వహిస్తారేమో!

వారి సంగతలా ఉంటే.. సినిమా వాళ్ల కోసం వన భోజనాలను నిర్వహించనున్నారట జీవిత. 'మా' లో సభ్యుంలందరి కోసం ఈ వనభోజనాలను నిర్వహించనున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఎవరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించడం లేదని, మా సభ్యులందరి కోసం వనభోజనాలను నిర్వహించనున్నట్టుగా జీవిత ప్రకటించారు.

అయితే ఈ కార్యక్రమం 'మా' డబ్బులతో కాదట, జీవితారాజశేఖర్ లు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. ఈ వన భోజనాలతో మా లో తలెత్తిన సమస్యలను కూడా సమసిపోయేలా చేయాలని జీవిత అనుకుంటున్నారట. అందుకు ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉన్నారట.

మరి వనభోజనాలంటే.. ఈ అడవిలోకో, వనంలోకో.. కనీసం పార్కులోనో జరుగుతాయనుకునేరు. హైదరాబాద్ లోని ఒక మాల్ లో ఈ కార్యక్రమం జరగుబోతోందట. మరి వీటిని 'వనభోజనాలు' అనకూడదేమో, 'మాల్ భోజనాలు' అనాలేమో!