స్టార్ హీరో భారీ సినిమా.. ఓటీటీలో విడుద‌ల‌కు రెడీ!

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలంటే వాటి బ‌డ్జెట్ వంద కోట్ల రూపాయ‌ల‌కు ఈజీగా రీచ్ అయిపోతూ ఉంది. బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ సినిమా అంటే..అది కూడా మాస్ మ‌సాలా అంటే.. దాని…

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలంటే వాటి బ‌డ్జెట్ వంద కోట్ల రూపాయ‌ల‌కు ఈజీగా రీచ్ అయిపోతూ ఉంది. బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ సినిమా అంటే..అది కూడా మాస్ మ‌సాలా అంటే.. దాని బ‌డ్జెట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవ‌డం క‌ష్టం ఏమీ కాదు. ద‌క్షిణాదిన హిట్ అయిన కాంచ‌న సినిమాను అక్ష‌య్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

లారెన్స్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా హిందీ రీమేక్ లో అక్ష‌య్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తీ తెలిసిందే. ఈ సినిమాకూ లారెన్సే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విష‌యం ఏమిటంటే.. మ‌రో నాలుగు వారాల్లో ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. ఈద్ సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని మొద‌ట అనుకున్నారు. ల‌క్ష్మీబాంబ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు కొద్దిపాటి వ‌ర్క్ పెండింగ్ ఉంద‌ట‌. అది కూడా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కావ‌డంతో.. టీమ్ అంతా ఇళ్ల నుంచినే ప‌ని చేస్తూ ఆ వ‌ర్క్ ను ఫినిష్ చేస్తూ ఉంద‌ట‌.

అనుకున్న స‌మాయానికి ఈ సినిమా రెడీ అవుతోంది కానీ, విడుద‌ల‌కు మాత్రం ఇప్పుడ‌ప్పుడే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అక్ష‌య్ కుమార్ దాదాపుగా ఓకే అని, డీల్ న‌డుస్తూ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత‌ల్లో అక్ష‌య్ కూడా ఒక‌రు.

ఒక‌వైపు తెలుగులో కొన్ని సినిమాలను ఓటీటీ ఫ్లాట్పామ్స్ పై విడుద‌ల‌కు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు వంద‌ల కోట్ల రూపాయల పై స్థాయి సినిమా అయిన కాంచ‌న రీమేక్ హాట్ స్టార్ లో విడుద‌ల అయితే.. సంచ‌ల‌న‌మే అవుతుంది.

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా