మతి మరుపు, అతి శుభ్రం, తాత-మనవడు, అతి మంచితనం, ఊరంత బలుపు ఇలాంటి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి హిట్ లు కొట్టిన దర్శకుడు మారుతి. మరి ఈసారి ఏం చేయబోతున్నారు? ఏం కాన్సెప్ట్ తయారు చేస్తున్నారు? ప్రతి రోజూ పండగే సినిమా తరువాత యువి-గీతా 2 బ్యానర్లకే సినిమా చేయడం అన్నది ఫిక్స్ అయిపోయింది. మరి ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి?
వర్తమాన సమాజంలో మాయమైపోతున్న పెద్ద కుటుంబాల నేపథ్యంపై మారుతి ఈసారి కథ అల్లు కుంటున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఫ్యామిలీలే ఎక్కడ చూసినా కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యామిలీ ప్లానింగ్ కు దూరంగా వుండే తండ్రి, ఆ ఇంట్లో పుట్టిన కుర్రాడు, ఆ ఇంటికి రాబోయే అమ్మాయి. వీళ్లందరి మధ్య పుట్టే ఫన్.
ఇదీ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. పక్కాగా ఎనీ యంగ్ హీరోకు సూటయ్యే సబ్జెక్ట్. అయితే అదే సమయంలో మళ్లీ ప్రతి రోజూ పండగ మారిదిగా ఓ సీనియర్ యాక్టర్ స్పెషల్ క్యారెక్టర్ ఎలాగూ వుంటుంది. పెద్ద ఫ్యామిలీ కాబట్టి, కలర్ ఫుల్ గా అమ్మాయిలు, అబ్బాయిలు వుంటారు. సో మళ్లీ ఫ్యామిలీలను థియేటర్ కు సులువుగా రప్పించేలా కథ తయారుచేసుకుంటున్నారు మారుతి.
అయితే అంతా బాగానే వుంది. హీరో ఎవరు అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చను. అది మాత్రం యువి/గీతా చేతుల్లోనే. ఎందుకంటే కథలో హీరో క్యారెక్టర్ దాదాపు అందరు యంగ్ హీరోలకు సెట్ అవుతుంది. అందువల్ల ఎవర్ని తీసుకువస్తే వాళ్లతోనే సినిమా. అది బన్నీ దగ్గర నుంచి ఎవరైనా కావోచ్చు.