అరవింద సమేత వీరరాఘవ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. ప్రచారం వీక్ గా వున్నా, సినిమా మీద అంచనాలు బాగానే వున్నాయి. చెన్నయ్ లో సినిమా డిఐ జరుగుతోంది. అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా సెకండాఫ్ లో ఎన్టీఆర్ లెక్చరర్ అవతారం ఎత్తుతారని తెలుస్తోంది. అంటే నిజంగా లెక్చరర్ అని కాదు, వీలయినంత ఉపన్యాసాలు దంచడం అన్నమాట.
సినిమాలో భారీ ఫైట్లు ప్రథమార్థంలో వున్నా, ద్వితీయార్థంలో ఫ్యాక్షనిస్టులను మార్చే క్రమంలో ఎన్టీఆర్ పాత్ర కాస్త ఎక్కువగానే ఉపన్యాసాలు ఇస్తూ వుంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇలాంటి డెప్త్ డైలాగులు రాయడంలో దిట్ట. ఎన్టీఆర్ తన బేస్ వాయిస్ తో ఇలాంటి డైలాగులు ఇంకా బాగా చెబుతారు.
అందువల్ల అరవింద సమేతలో అభిమానులు సినిమా ద్వితీయార్థంలో మాంచి లెక్చర్లు వినే అవకాశం వుంది. ఇదిలా వుంటే ఇంటర్వేల్ బ్యాంగ్ కు ఇరవై నిమషాలు ముందుగా వచ్చే ఫైట్ మాత్రం అదిరిందని చెన్నయ్ వర్గాల టాక్.