లాంగ్ కాదు..షార్ట్ మార్చ్ నే

విశాఖ లో లాంగ్ మార్చ్ అంటూ హడావుడి చేస్తోంది జనసేన పార్టీ.  తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానకి నాలుగున్నరేళ్లు తీసుకున్న జనసేన పార్టీ ఆరు నెలలు కాకుండానే వైకాపా మీద యుద్ధ భేరి మోగిస్తోంది. Advertisement…

విశాఖ లో లాంగ్ మార్చ్ అంటూ హడావుడి చేస్తోంది జనసేన పార్టీ.  తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానకి నాలుగున్నరేళ్లు తీసుకున్న జనసేన పార్టీ ఆరు నెలలు కాకుండానే వైకాపా మీద యుద్ధ భేరి మోగిస్తోంది.

సరే, ఆ పార్టీ అజెండా ఆ పార్టీ నేత ఇష్టా ఇష్టాల మీద ఆధారపడి వుంటుంది. అయితే ఇంతకీ ఈ లాంగ్ మార్చ్ అంటే ఏమిటి? ఓ పది ఇరవై కిలోమీటర్లు వుంటుందా? అసలు ఏమిటి దీని వైనం అంటే. అంత సీనేం లేదట.

జస్ట్ విశాఖలోని మద్దిలపాలం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వరకు అంట. గట్టిగా కిలోమీటర్ కాస్త అటుగా వుంటుంది. దీనికి లాంగ్ మార్చ్ అని పేరు.

గతంలో పేరు పెట్టకుండా ఇలాంటివి చాలా జరిగాయి. అంతెందుకు విశాఖ విమానాశ్రయానికి ఏ పెద్ద నాయకుడు వచ్చినా, అక్కడి నుంచి ఊరులోకి దాదాపు పది కిలో మీటర్లు ఈ లాంగ్ మార్చ్ తరహాలోనే తీసుకెళ్తారు. పవన్ కు అది అనుభవమే.

మరి ఆ రేంజ్ లో చేయకుండా ఈ కిలోమీటర్ మేరకు హడావుడి ఏమిటో? అంటే మరీ లెంగ్త్ ఎక్కువ అయితే జనం పలచన అయిపోతారనే అనుమానమా?

నిజానికి ఈ రోడ్ లో ప్లాన్ చేయడం వెనుక కూడా అదే స్ట్రాటజీ అనుకోవాలి. ఎందుకంటే మద్దిలపాలెం టు జి వి ఎమ్ సి ఆఫీసు రోడ్ చాలా బిజీ రోడ్ లో. ఎవరు ఏ హడావుడి చేయకుండానే లాంగ్ మార్చ్ టైపులో వుంటుంది. 

అదే బీచ్ రోడ్ లో ఓ అయిదు కిలోమీటర్ల మేరకు లాంగ్ మార్చ్ చేస్తే, అప్పుడు తెలుస్తుంది జనం వచ్చిందీ? రానిదీ?