గబ్బు గబ్బుగా తయారైన టాలీవుడ్ నటీనటులు సంఘం 'మా' ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మా ఎన్నికల అవకతవకలు ఇప్పుడు కోర్టుకు చేరాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ కళ్యాణ్ అనే నటుడు కోర్టులో ఎన్నికల అవకతవలపై పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం వుంది.
నామినేషన్ల స్వీకారంలో నిబంధనలు పాటించలేదని, సమయం దాటాక కూడా నామినేషన్లు తీసుకున్నారని, జయసుధ స్వయంగా నామినేషన్ వేయలేదని, ఇంకా పలు అంశాలను పిటిషన్ లో పెర్కొన్నట్లు తెలిసింది.ఒక వేళ ఈ పిటిషన్ ను కోర్టువిచారణకు స్వీకరించి, వాయిదా వేస్తే, ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుంది. ఎన్నికలు29న జరగాల్సి వుంది.