రాజశేఖర్ గెడ్డం గ్యాంగ్ తో పాటు ఆశ పెట్టుకున్న మరో సినిమా పట్టపగలు. ఉదయం సినిమా అనుకుని, మధ్యాహ్నం ప్రారంభించి, సాయంత్రానికి రెడీ చేయగల కెపాసిటీ వున్న రామ్ గోపాల్ వర్మ దీని దర్శకుడు. అయితే రామ్ ఖాతాలో వున్న అనేకానేక సినిమాల కారణంగా ఇది అంతగా జనానికి గుర్తులేదు.
ఈ సినిమా తీసిన తరువాత దాని క్వాలిటీ మీద రాజశేఖర్ కి అనుమానం వచ్చిందని వినికిడి. అసలే గెడ్డం గ్యాంగ్ తో తిన్న దెబ్బ ఇంతా అంతా కాదు. అందుకే కాస్త రిపేర్ చేయమని ఆర్జీవీని కోరాడట. తీయడమే,తప్ప తీసింది వెనక్కుచూడడం అలవాటు లేదనిపించేలా ప్రవర్తించే ఆర్జీవీ ప్రస్తుతం తాను బిజీ,,కావాలంటే మీరే రీషూట్ చేసుకోండన్నాట.
కానీ పాపం, అల్లరి ప్రియుడు మాత్రం,, బాబ్బాబు ఖాళీ చూసుకుని మీరే చేయండి అని కోరుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ రీ షూట్ ఎప్పుడవుతుందో..సినిమా బయటకు ఎప్పుడు వస్తుందో?