‘మా’లో మళ్లీ ఢీ అంటే ఢీ?

'మా' ఎన్నికలు ముగిసాయి. గెలచిన రాజేంద్ర ప్రసాద్ హడావుడి పూర్తయింది. ఇక కార్యాచరణ మిగిలింది. ఇందుకోసం మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. మా సంఘంలో ఇద్దరు ముగ్గురు జయసుధ వర్గం వారు కూడా వున్నారు.…

'మా' ఎన్నికలు ముగిసాయి. గెలచిన రాజేంద్ర ప్రసాద్ హడావుడి పూర్తయింది. ఇక కార్యాచరణ మిగిలింది. ఇందుకోసం మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. మా సంఘంలో ఇద్దరు ముగ్గురు జయసుధ వర్గం వారు కూడా వున్నారు.  అందువల్ల కలిసి పనిచేద్దామంటూ గెలిచిన తరువాత వల్లించిన సూక్తి ముక్తావళి ఇప్పుడు గాలికి ఎగిరిపోయినట్లు బోగట్టా.  

మంగ‌ళ‌వారం జరిగిన `మా` స‌ర్వస‌భ్యస‌మావేశం ఇందుకు వేదికగా మారింది.  ఈ సంద‌ర్బంగా అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ తెచ్చిన ఓ ప్రతిపాద‌నను జయసుధ వర్గానికి చెందిన వారు వ్యతిరేకించారని వినికిడి. దీంతో సీనియర్ ఆర్టిస్టు నరేష్ కు, అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కు కాస్త మాటా మాటా అయినట్లు తెలుస్తోంది.  ఆఖరికి ఏ నిర్ణయమూ తీసుకోకుండానే వ్యవహారం ముగిసిందట. ఇలా అయితే ఇక మా వ్యవహారాలు ముందుకు సాగినట్లే.