సుందరకాండ సినిమా గుర్తుందిగా..లెక్చరర్ ను లవ్వాడిన అమ్మాయి కథ,. అది ఆ రోజుల్లో తమిళనాటే పుట్టింది. ఇప్పుడు అలాంటి వ్వవహారాలు అక్కడ చిచ్చు రేపుతున్నాయట. ముఖ్యంగా ట్వెంటీస్ లో వున్న లేడీ టీచర్లు, క్లాసు కుర్రాళ్లను తీసుకుని చెక్కేస్తున్నారట. ఇలాంటి వ్యవహారాలు ముదిరి ముదిరి ప్రభుత్వం కలుగచేసుకునే దాకా వెళ్లిందట.
బాగానే వుంది. కానీ మన ప్రభుత్వాలు ఎప్పుడూ రివర్స్ లో ఆలోచిస్తాయి. ఇక్కడ కూడా అంతే, టైట్ టాప్ లు, జీన్ ఫ్యాంట్లు వేసుకోవద్దు టీచరు అమ్మళ్లు అంటోందట సిఫార్సుల కమిటీ. అప్పడే టీచర్లు బుస్సుమంటున్నారు. ఈ తరహా డ్రెస్ కోడ్ సరికాదు అంటున్నారు.
అయినా పిల్లలకు యూనిఫారమ్ లు వున్నట్లు టీచర్లకు కూడా సింగిల్ కలర్ శారీలు యూనిఫారమ్ గా పెడితే ఈ లేచిపోవడాలు తగ్గుతాయంటారా? లేక టీచరమ్మలు శారీల్లో ఇంకా సెక్సీగా కనిపించి పెరుగుతాయా? అసలు అంతెందుకు..యంగ్ టీచర్లను బదులు ఫార్టీ ప్లస్ సీనియర్లను అపాయింట్ చేస్తే ఈ సమస్య వుండదేమో?