మా తీరు అస్సలు బాలేదు- విష్ణు

టాలీవుడ్ నటీనటుల సంఘం మా వ్యవహారాలపై ఇప్పటికి పబ్లిక్ లో నిరసనలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇండస్ట్రీలో పెద్దలు ఎవరూ బాహాటంగా గొంతు విప్పలేదు. Advertisement అయితే తొలిసారి ఓ పెద్ద ఫ్యామిలీ…

టాలీవుడ్ నటీనటుల సంఘం మా వ్యవహారాలపై ఇప్పటికి పబ్లిక్ లో నిరసనలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇండస్ట్రీలో పెద్దలు ఎవరూ బాహాటంగా గొంతు విప్పలేదు.

అయితే తొలిసారి ఓ పెద్ద ఫ్యామిలీ గట్టిగానే నిరసన వ్యక్తం చేసింది. సీనియర్ హీరో మోహన్ బాబు కుమారుడు, హీరో విష్ణు, మా వ్యవహారాలపై తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన మా కు ఓ లేఖ రాసారు.

శ్రీరెడ్డి ఉదంతంపై మా అసోసియేషన్ కార్యవర్గం ప్రవర్తించిన తీరును ఆయన పూర్తిగా తప్పుపట్టారు. తమ ఇంట్లో తండ్రి, తాను, సోదరుడు, సోదరి మా సభ్యులుగా వున్నామని, తాము ఎవరితో నటించాలో? ఎవరితో నటించకూడదో మా సంఘం ఎలా డిసైడ్ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తమకు మా టెర్మ్ లు డిక్టేట్ చేయకూడదని, ఆ మాటకు వస్తే, ఎందరో నటీనటులు మా లో సభ్యులుగా లేరని, వారంతా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారని గుర్తు చేసారు.

మొత్తం మీద చూసుకుంటే మా సంఘ కార్యవర్గం నిర్వాకాల వల్ల దేశంలోనూ, బయటా కూడా టాలీవుడ్ పరువు పోయిందని విష్ణు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా మా సంస్థ నిబంధనలు పటిష్టంగా వుండాలని, టాలీవుడ్ లో చాలా సంఘాల్లో సభ్యత్వపై గట్టి నిబంధనలు వున్నాయని, విష్ణు గుర్తు చేసారు.

ఇక టాలీవుడ్ లో మహిళలను ఎక్స్ ప్లాయింట్ చేయడం అనే ఆరోపణలపై ఓ సమగ్ర కమిటీ ఏర్పాట్లు చేయాలని, అందులో కేవలం నటీనటులే కాకుండా, నిర్మాతలు, దర్శకులు, మేనేజర్లు, రైటర్లు అందరికీ భాగస్వామ్యం కల్పించాలని, కేవలం మా మాత్రమే ఈ ఇస్యూని హ్యాండిల్ చేయలేదని విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మా నుంచి సరైన సమాధానాన్ని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.