మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదోగానీ, వాటి పట్ల నమ్మకం వున్నవాళ్ళు చాలామందే వుంటారు. అయితే సెక్సీ తార సమంతకు మంత్రాలు తెలుసా? ఏదో మాయ చేసిగాని సినిమాలు సొంతం చేసుకుంటుందా? అనే అనుమానంతో కొంతమంది అదే ప్రశ్న ఆమెను అడిగేస్తే, బోలెడంత సిగ్గుపడిపోయి, నవ్వేసి..
నాకు అలాంటి తంత్రాలు తెలియవండీ.. ‘ఏం మాయ చేశావే’ సినిమా చేశాను కాబట్టి మీరలా అడుగుతుండొచ్చు. నేను ఎలాంటి వివాదాలూ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. నన్ను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు కాబట్టే దర్శక నిర్మాతలు తీసుకుంటున్నారు తప్ప నేను చేతబడి చేసో, ఇంకొకటి చేసో సినిమాలు పట్టెయ్యడం లేదని సమంత సమాధానమిచ్చింది.
నేను నటించే హీరోలంతా నాతో ఇట్టే కలిసిపోతారు. నేను నొప్పించేలా మాట్లాడను. గ్లామర్ అంటారా.. నా కన్నా గొప్ప అందగత్తెలు ఉద్యోగాలు చేసుకుంటూ వున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో ఓ సినవమిఆ చేస్తున్నాను. ఆ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్‌ని పరిశీలించాక ఫైనల్‌గా నన్ను తీసుకున్నారు. ఏం మాయ చేశావని తమిళ పత్రికలూ అడిగాయి. నా మాయ అంతా నా పనిలోనే వుంది. సిన్సియర్‌గా పనిచేస్తే అందరూ మాయ చెయ్యవచ్చు.. అంటోంది ముద్దుగుమ్మ సమంత.