మెల్ల మెల్లగా కదులుతున్న మహాభారతం

వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమా అది. ప్రకటన కూడా భారీ స్థాయిలో చేశారు. అంతే ఆ తర్వాత మళ్లీ చప్పుడు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మహాభారతంలో కదలిక వచ్చింది. ఈ సినిమా…

వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమా అది. ప్రకటన కూడా భారీ స్థాయిలో చేశారు. అంతే ఆ తర్వాత మళ్లీ చప్పుడు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మహాభారతంలో కదలిక వచ్చింది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. భీముడి పాత్రధారి మోహన్ లాల్ ఆ క్యారెక్టర్ కోసం జిమ్ బాట పట్టాడు. భీమ పాత్ర కోసం గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు.

శ్రీకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకుంటున్నారు. ఈ మేరకు టాప్ యాక్షన్ డైరక్టర్ లీ విట్కర్ తో చర్చలు జరుపుతున్నారు. హాలీవుడ్ లో ఎక్స్-మెన్, ఫాస్ట్ ఫైవ్, పెరల్ హార్బల్ లాంటి సినిమాలకు యాక్షన్ డైరక్టర్ గా వర్క్ చేశాడు లీ. 

2020లో విడుదల చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టుకు ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త బీఆర్ షెట్టి నిర్మాత. ఈ సినిమా కోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాడు షెట్టి. సినిమా విడుదల సమయానికి మరో 100కోట్లు బడ్జెట్ పెరిగే అవకాశాలున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్ టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమూజమ్’ అనే గ్రంథం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారతం మొత్తాన్ని భీముడి కోణంలో చెప్పడం ఈ గ్రంథం ప్రత్యేకత. అందుకే భీముడి పాత్రధారిని ముందుగా ఎంపిక చేశారు.