ఓ మహర్షి.. ఆ సెంటిమెంట్ కొనసాగనీ!

మహర్షి సినిమాకు సంబంధించి '9' సెంటిమెంట్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్.. ఇలా ప్రతిదానికి 9 అనే అంకె సింక్ అయ్యేలా టైమ్ సెట్ చేసి మరీ రిలీజ్…

మహర్షి సినిమాకు సంబంధించి '9' సెంటిమెంట్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్.. ఇలా ప్రతిదానికి 9 అనే అంకె సింక్ అయ్యేలా టైమ్ సెట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకు టీజర్ ను 9 గంటల 9 నిమిషాలకు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అదే టైపులో ఇప్పుడు ట్రయిలర్ కూడా టైమ్ ఫిక్స్ చేశారు.

ఈరోజు మహర్షి ట్రయిలర్ ను సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. అలా ట్రయిలర్ విషయంలో కూడా 9-సెంటిమెంట్ ఫాలో అయ్యారు మేకర్స్. సాయంత్రం 6 గంటల నుంచి పీపుల్స్ ప్లాజాలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. అదే వేదికపై సాయంత్రం 8.10కు ట్రయిలర్ ను రిలీజ్ చేస్తారు.

ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ట్రయిలర్ లాంచ్ కాస్త అటుఇటు అవ్వొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రయిలర్ సరిగ్గా చెప్పిన టైమ్ కు అప్ లోడ్ అయిపోతుందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే.. సినిమాను కూడా మొదటిరోజు మొదటి ఆటను సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు స్టార్ట్ చేస్తారేమో.

మరోవైపు ఈ సినిమాలో పాటలన్నింటినీ జ్యూక్ బాక్స్ రూపంలో ప్రీరిలీజ్ కంటే 24 గంటల ముందే విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు మిగతావన్నీ ఇందులో ఉన్నాయి. పాటలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సినిమాకు బజ్ లేదు. కనీసం ట్రయిలర్ అయినా క్లిక్ అయితే మహర్షికి కాస్త హైప్ వస్తుంది.

శంకర్ సినిమా అంటే.. భారీతనం, డిఫరెంట్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్