మహేష్…ఆనందం ఆనందమే

సమ్మర్ లో రావాలని స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు..కొరటాల శివ, మహేష్ బాబు. కానీ దానికి కాదు ఆనందం..అసలు ఒక్క ఆనందం కాదు..ఆనందం..ఆనందం. ఇది మహేష్ సినిమా టైటిల్..మల్టీ స్టారర్ సినిమా టైటిల్. కన్ఫూజన్…

సమ్మర్ లో రావాలని స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు..కొరటాల శివ, మహేష్ బాబు. కానీ దానికి కాదు ఆనందం..అసలు ఒక్క ఆనందం కాదు..ఆనందం..ఆనందం. ఇది మహేష్ సినిమా టైటిల్..మల్టీ స్టారర్ సినిమా టైటిల్. కన్ఫూజన్ వద్దు. తెలుగు సినిమా కాదు..తమిళ సినిమా. 

వెంకటేష్-మహేష్ కలిసి రెండేళ్ల క్రితం తెలుగులో చేసిన సందడి గుర్తుందిగా..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సమంత-అంజలి-ప్రకాష్ రాజ్ వీరికి తోడై మాంచి సినిమా అందించారు. 

ఆ సినిమా అప్పటి నుంచి తమిళనాట ఇదిగో విడుదలవుతుంది..అదిగో విడుదలవుతుంది..అంటూ సాగుతోంది.ఈ సినిమా పేరే..ఆనందం..ఆనందమే. ఈ సమ్మర్ కు తమిళ ప్రేక్షకులను అలరించబోతోంది.