ఏంటో త్రివిక్రమ్..మాంచి అమ్మాయిలను చూపించి, మెయిన్ హీరోయిన్లేమో అనుకునేలా చేస్తాడు. తీరా చేసి, వాళ్లకు వేరే వాళ్లతో లవ్వు..ఆపై హీరో వాళ్ల పెళ్లి చేయడం. అప్పుడు అసలు సిసలు హీరోయిన్ తో లవ్వు. ఇదే అత్తారింటికి దారేది లో చూసాం..ప్రణీత వెంటబడి, ఆమె ప్రియుడితో, పెళ్లికి సాయం చేస్తాడు పవన్.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే. ఉపేంద్ర తన సోదరిని బన్నీ కి ఇచ్చి చేద్దామనుకుంటే, ఆమె ప్రేమకు సాయం చేస్తాడు బన్నీ. ఎందుకంటే బన్నీ టార్గెట్ రాజేంద్ర ప్రసాద్ కూతురు సమంత కాబట్టి.
అన్నట్లు ఇక్కడ ఉపేంద్ర సీన్ ఏమిటి? బన్నీ ప్రేమించిన సమంత తండ్రి రాజేంద్ర ప్రసాద్ డబ్బులు ఉపేంద్ర దగ్గర ఇరుక్కున్నాయి. వాటిని తేవాలి కదా.. ఇవీ సత్యమూర్తి లేటెస్ట్ గుసగుసలు.