మిసెస్ మహేష్ బాబు మాస్టర్ ప్లాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సారి ఓ మాస్టర్ ప్లాన్ వేసారు. తన సినిమా వల్ల నిర్మాతలు నష్టపోవడమో, లాభ పడడమో, లేదా నిర్మాతలు లాభపడి బయ్యర్లు నష్టపోవడమో ఇప్పటికి ఒకటి మూడు…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సారి ఓ మాస్టర్ ప్లాన్ వేసారు. తన సినిమా వల్ల నిర్మాతలు నష్టపోవడమో, లాభ పడడమో, లేదా నిర్మాతలు లాభపడి బయ్యర్లు నష్టపోవడమో ఇప్పటికి ఒకటి మూడు సార్లు జరిగింది. ఇలా జరిగిన ప్రతిసారీ బయ్యర్లను ఆదుకోవాలని మహేష్ అనుకున్నా కూడా వీలు కావడం లేదు. ఎందుకంటే మహేష్ కు బయ్యర్లకు మధ్య నిర్మాత వుంటారు. సో, ఈయన చేసిన సాయం అక్కడకు వెళ్తుందో, వెళ్లదో తెలియదు. అమ్మకాల మీద క్లారిటీ వుండదు.

అందుకే ఈసారి మిసెస్ మహేష్ బాబు నమ్రత, దర్శకుడు కొరటాల శివ కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేసారు. భరత్ అనే నేను సినిమాకు కొన్ని లెక్కలు కొట్టి, ఈ మాత్రం ప్రాఫిట్ రావచ్చు అని తేల్చారు. ఆ మేరకు నిర్మాత దానయ్యకు హామీ ఇచ్చేసారు. అంటే ఇక సినిమా హిట్, ఫ్లాప్, మార్కెటింగ్ లతో సంబందం లేదు. దానయ్యకు ఫిక్స్ డ్ ప్రాఫిట్ ఇచ్చేస్తారు.

సినిమా మార్కెటింగ్ వ్యవహారాలు అన్నీ కొరటాల శివ, నమ్రత చూసుకుంటారు. నిర్మాతగా దానయ్య కో ఆర్డినేట్ చేస్తారు. ఏమైనా మిగులు తగులు వుంటే అది కొరటాల శివ-నమ్రత చూసుకుంటారు. దీని వల్ల ఒక విధంగా నిర్మాతకు మంచిదే. అదే విధంగా బయర్లకు కూడా మంచిదే అని చెప్పాలి.