Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌ ‘బావ’లకే పరిమితం!

మహేష్‌ ‘బావ’లకే పరిమితం!

మహేష్‌బాబుతో గోన గన్నారెడ్డి పాత్ర చేయించుకోవాలని గుణశేఖర్‌ అతని చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో మూడు సినిమాలు చేసిన మహేష్‌బాబు కనీసం మొహమాటానికి కూడా గుణశేఖర్‌ అడిగిన దానికి సానుకూలంగా స్పందించలేదు. ఒక్కడులాంటి సినిమానిచ్చి తనని స్టార్‌ని చేసిన డైరెక్టర్‌ని కూడా మహేష్‌ ఎంటర్‌టైన్‌ చేయలేదు. 

తన క్లోజ్‌ డైరెక్టర్ల సినిమాల్లో అతిథి పాత్రలు చేయడానికి మహేష్‌ ఎప్పుడూ సమ్మతించలేదు. మహా అయితే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి సరిపెట్టుకోమన్నాడంతే. అదే తన బావల దగ్గరకి వచ్చేసరికి మహేష్‌ ఏదైనా చేసేస్తాడు. ట్విట్టర్‌లో తనకి లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉంటే మహేష్‌ కేవలం తన బావ జయదేవ్‌ గల్లాని మాత్రమే ఫాలో అవుతాడు. అతడికి కూడా మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌లా వ్యవహరిస్తుంటాడు. 

అలాగే తన చెల్లెలి భర్త సుధీర్‌ బాబుని కూడా మహేష్‌ బాగా ఎంకరేజ్‌ చేస్తున్నాడు. సుధీర్‌ నటిస్తోన్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ చిత్రంలో మహేష్‌ గెస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. వేరే ఎవరికైనా కానీ మహేష్‌తో అతిథి పాత్ర చేయించుకోవడం దాదాపు అసాధ్యం. కానీ సుధీర్‌ కోసం మహేష్‌ అతిథి వేషం కట్టేస్తున్నాడు. బావ కళ్లల్లో ఆనందం చూడ్డానికి మహేష్‌ ఏదైనా చేసేస్తాడన్నమాట. సూపర్‌ కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?