మహేష్ చెప్పింది నిజమే

సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా హైదరాబాద్ కే తలమానిక అన్నట్లుగా ఎఎమ్ బి మాల్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మాల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అయితే ఈ…

సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా హైదరాబాద్ కే తలమానిక అన్నట్లుగా ఎఎమ్ బి మాల్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మాల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అయితే ఈ మాల్ లో తనకే అవెంజర్స్ చూడడానికి టికెట్ దొరకలేదని మహేష్ బాబు మీడియాతో చెప్పాడు. కాస్త అతిశయోక్తి ఏమో అనుకున్నారు.

కానీ కాదట, జస్ట్ వన్ డే ముందు అనుకోవడంతో టికెట్ లు అయిపోయాయని మల్టీఫ్లెక్స్ నిర్వాహకులు చెప్పారట. ఆ సంగతి అలావుంచితే, మరోసారి మహేష్ బాబుకు అదే సమస్య వచ్చింది. ఎఎమ్ బి మాల్ లో పార్టీ హాల్ అనేది ఒకటి వుంది. బర్త్ డే పార్టీలు, చిన్న చిన్న ఫంక్షన్ లు చేసుకోవచ్చు. విఐపి స్క్రీన్ కు అటాచ్డ్ గా వుంటుంది అది. 

ఈ హాల్ లో మహర్షి ప్రమోషనల్ ఇంటర్వూ ఏదో చేయాలని అనుకున్నారట. కానీ అది అప్పటికే ఎవరో బుక్ చేసేసుకున్నారట. దాంతో ఇక తప్పక ఎమ్ లాంజ్ లో అరేంజ్ చేసుకున్నారట. మొత్తంమీద ఎఎమ్ బి మాల్ మహేష్ కు మాంచి సక్సెస్ ఫుల్ వెంచర్ అనుకోవాలి.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?