వంశీని వదిలి మహేష్ ను అడిగితే ఎలా?

ఊపిరి సినిమా మంచి హిట్. కానీ నిర్మాతకు రూపాయి లాభంలేదు. కావలం కాస్ట్ ఫెయిల్యూర్. అప్పటి నుంచే పేరు పడిపోయింది. డైరక్టర్ వంశీ పైడిపల్లి అంటే భయంకరంగా ఖర్చు చేయిచేస్తారు అని. అంతేకాదు. విపరీతంగా…

ఊపిరి సినిమా మంచి హిట్. కానీ నిర్మాతకు రూపాయి లాభంలేదు. కావలం కాస్ట్ ఫెయిల్యూర్. అప్పటి నుంచే పేరు పడిపోయింది. డైరక్టర్ వంశీ పైడిపల్లి అంటే భయంకరంగా ఖర్చు చేయిచేస్తారు అని. అంతేకాదు. విపరీతంగా అవుట్ ఫుట్ వస్తుంది. బోలెడు రోజులు వర్క్ చేస్తారు అని. 

మహర్షి సినిమాకు అదే జరిగింది. లెక్కలేనన్ని రోజులు వర్క్ చేసారు. భారీగా ఖర్చు చేయించారు. తీసిన షాట్ లే మళ్లీ తీసారు. ఎడిటింగ్ టేబుల్ మీదకు నాలుగు గంటల ఔట్ పుట్ తీసుకువచ్చారు. సాధారణంగా అనుకున్న దానికన్నా పది నుంచి పదిహేనుశాతం అదనపు అవుట్ పుట్ అన్నది కామన్. కానీ ఇక్కడ అంతకు మించి వచ్చింది. ఇదంతా వృధా ఖర్చే.

వాస్తవానికి ఈ సినిమాకు మహేష్ తన రెమ్యూనిరేషన్ కాస్త తగ్గించే తీసుకున్నారు. ముగ్గురికి కలిపి చేస్తున్నా అని చెప్పి. మహేష్ ఇలా తగ్గించుకోవడం ఇదే ప్రథమం. కానీ చిత్రంగా ఖర్చు గురించి వస్తున్న వార్తలు కానీ, అన్నీ మహేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డు గురించి కానీ, ఆయన పెట్టే ఖర్చుల గురించి కానీ, ఊపిరి కాస్ట్ ఫెయిల్యూర్ గురించి కానీ మాట్లాడడంలేదు.

ఖర్చు పెట్టించిన వంశీ పైడిపల్లిని వదిలేసి, ఆయనను అడగకుండా, మహేష్ ను అడుగుతారేంటీ అంటు క్రాస్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. వంశీ పైడిపల్లి తన పెర్ ఫెక్షన్ కోసమో, మరొకందుకో ఖర్చు చేయిస్తే మహేష్ ఏం చేస్తాడు అని వారి వాదన. ఒక విధంగా వాస్తవం కూడా. వంశీ పైడిపల్లి ఇంత వరకు మీడియా ముందుకు రాలేదు. ఇంక మూడురోజులు వుంది. మరి విడుదల ముందు వస్తారో? అయ్యాక వస్తారో?

ఇదిలావుంటే మహర్షి సినిమా వ్యయం పెరగడానికి ఇంకో కారణం భారీగా వడ్డీల భారం కూడా ఇందులో కలపడమే అని తెలుస్తోతది. దాదాపు అన్నీకలిపి 21 కోట్లు అచ్చంగా వడ్డీలే బడ్జెట్ లో వున్నట్లు తెలుస్తోంది.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?