Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ కూడా 26నే.. ఇప్పుడు కదా మజా

మహేష్ కూడా 26నే.. ఇప్పుడు కదా మజా

నాపేరు సూర్య ఏప్రియల్ 26 విడుదల అని నిర్మాతలు ప్రకటించారో లేదో.. గంట గడవకుండానే మహేష్ సినిమా భరత్ అనే నేను కూడా రెడీ అయిపోయింది. అధికారిక ప్రకటన వచ్సేసింది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ, దానయ్య డి.వి.వి.ల 'భరత్‌ అనే నేను' విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, అంటూ పత్రికా ప్రకటన.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యుయేషన్‌గా పూనెలో షెడ్యూల్‌ ఉంటుంది. మార్చి 27 వరకు టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం. మహేష్‌గారితో కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బేనర్‌కి ఇది ఓ ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?