Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేశ్ సినిమా.. విజయ్ సినిమాకు సీక్వెల్ ?!

 మహేశ్ సినిమా.. విజయ్ సినిమాకు సీక్వెల్ ?!

మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా గురించి ఆసక్తికరమైన కబుర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒక తమిళ సినిమాకు సీక్వెల్ అని అంటున్నారు! తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తమిళంలో ‘తుపాకీ-2’ గా విడుదల అవుతుందని సమాచారం. విజయ్ హీరోగా తుపాకీ అని ఒక హిట్ సినిమా ఉంది. దానికి కూడా మురగదాసే దర్శకుడు. 

మహేశ్ తో ఈ దర్శకుడు రూపొందించిన సినిమా తుపాకీకి కొనసాగింపు అని తమిళనాట ప్రచారం చేయనున్నారట. తుపాకీలో విజయ్ చేసిన పాత్రకు కొనసాగింపే మహేశ్ చేస్తున్నాడని అక్కడ ప్రచారం సాగించే అవకాశం ఉంది. తద్వారా సినిమాపై అటెన్షన్ తీసుకురావొచ్చనేది ఎత్తుగడ! తుపాకీకి సీక్వెల్ ను విజయ్ చేయలేదు, మహేశ్ చేశాడు, దర్శకుడు మాత్రం మురగదాసే అన్నట్టుగా సినిమాను విడుదల చేయనున్నారక్కడ.

ముందుగా చెప్పిందైతే.. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారనేది. తెలుగు, తమిళాలతో పాటే.. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తారనే మాట వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా అక్కడ దీన్ని పునర్నిర్మిస్తారట. మరి రీమేక్ కావాలంటే.. ముందుగా, తెలుగు – తమిళాల్లో విజయవంతం కావాలేమో!

ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఉన్న ప్రచారం ఎంతో చెప్పనక్కర్లేదు. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదని, జనవరి తర్వాతే టైటిల్ ఖారారవుతుందని సమాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?