మహేష్ నుంచి అఖిల్ కు షిప్ట్

తెలుగు సినిమా హీరోలు కూడా ప్రకటనల్లో బిజీ అయిపోయారు చాలా కాలం నుంచి. అందులో మహేష్ మరీనూ. అప్పుడప్పుడు ఈ బ్రాండ్ అంబాసిడర్లు అటు ఇటు మారుతుంటారు. సమంత చెప్పుల ఏడ్ మహేష్ కొట్టేసినట్లు.…

తెలుగు సినిమా హీరోలు కూడా ప్రకటనల్లో బిజీ అయిపోయారు చాలా కాలం నుంచి. అందులో మహేష్ మరీనూ. అప్పుడప్పుడు ఈ బ్రాండ్ అంబాసిడర్లు అటు ఇటు మారుతుంటారు. సమంత చెప్పుల ఏడ్ మహేష్ కొట్టేసినట్లు. ఇప్పుడు మహేష్ నుంచి అఖిల్ కు షిప్ట్ అయిపోయింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ మాల్ రెండేళ్ల క్రితం మహేష్ తో ఒప్పందం పెట్టుకుని, అతన్ని బ్రాండ్ అంబాసిడర్ ను చేసుకుంది.  

ఇప్పడు తాజగా అఖిల్ తో అగ్రిమెంట్ చేసుకుంది. కొత్త నీరు టైపు అన్నమాట. రెండేళ్లుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోస్టర్లపై మహేష్ ఫొటోని చూస్తూ వచ్చారు. ఇక అఖిల్ కనిపిపిస్తాడన్నమాట. కానీ ఒక్క మాట..ఇలాంటి ప్రకటనలు ఓకె. కానీ ఏవో వాటర్ ప్యూరి ఫయ్యర్లు, సేమ్యాలు లాంటి చిన్న వాటికి కూడా అఖిల్ రెడీ అయిపోతే.. అంత బా..గోదు..